- డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో నలుగురు మందుబాబులు పట్టివేత
- ప్రమాదాలకు కారణమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
మద్యం మత్తులో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కొడంగల్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీలు బుధవారం రాత్రి కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద విస్తృతంగా కొనసాగాయి.
ఈ తనిఖీల సందర్భంగా వాహనదారులను ఆపి పోలీసులు బ్రెత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో మొత్తం నలుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. పట్టుబడిన వారిలో అంతా ద్విచక్ర వాహనదారులే ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో కొందరి రక్తంలో ఆల్కహాల్ శాతం అధికంగా నమోదైనట్లు తెలిపారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో అధిక శాతం మద్యం మత్తులో డ్రైవింగ్ కారణంగానే జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నలుగురు వాహనదారులపై కేసులు నమోదు చేసి వారిని న్యాయస్థానంలో హాజరుపరుస్తామని కొడంగల్ ఎస్సై జి.వి. సత్యనారాయణ తెలిపారు. ప్రజలు చట్టాలను గౌరవించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కుటుంబ సభ్యుల భద్రతను, ఇతరుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.
అదేవిధంగా మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమై ఇతరుల ప్రాణాలు తీసినట్లయితే భారతీయ న్యాయ సంహిత (BNS) – 2023 చట్టంలోని సెక్షన్ 105 కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ చట్టం ప్రకారం గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు రానున్న రోజుల్లో కూడా కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి సహకరించాలని కోరారు.
|
మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి |
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



