ప్రభుత్వ భూమిని కబ్జాకోరుల చెరనుంచి కాపాడాలి

  • తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్‌కు బీఆర్ఎస్–బీజేపీ నాయకుల వినతిపత్రం

శ్రీ బల భీమ న్యూస్ /కోస్గి, జూలై 13:

కోస్గి పట్టణ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాకోరుల చెరనుంచి రక్షించాలని కోరుతూ కోస్గి బీఆర్ఎస్ ఇంచార్జ్ వెంకట్ నర్సిములు ఆధ్వర్యంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు సోమవారం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వెంకట్ నర్సిములు మాట్లాడుతూ, కోస్గి పట్టణంలోని ఇసుకబావి సమీపంలో సుమారు 25 గుంటల ప్రభుత్వ పరంపోగు భూమి ఉందని తెలిపారు. ఆ భూమిలో ఇప్పటికే కొందరు ప్రజాప్రతినిధుల అండతో దాదాపు 15 గుంటల భూమిని అక్రమంగా కబ్జా చేశారని, మిగిలిన భూమిని కూడా ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి, ప్రజల సమక్షంలో భూమి హద్దులను నిర్ధారించి ప్రభుత్వ భూమిని కబ్జాకోరుల చెర నుంచి రక్షించాలని కోరారు.

అనంతరం బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నేరుగా మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ నాగరాజుకు మరో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి, ఆక్రమణలను తొలగించేలా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ భూములను పరిరక్షించడం అధికారుల బాధ్యత అని పేర్కొన్న నాయకులు, అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే కోస్గి చౌరస్తాలో ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు అవసరమైతే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జనార్దన్ రెడ్డి, కోనేరు సాయప్ప, వెంకటేష్, మన్నె నరేష్ యాదవ్, మహేష్ గౌడ్, రామకృష్ణ, పద్మ, నరేష్, బెజ్జు రమేష్ తదితర బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles