దేవుడు వరమిచ్చినా… పూజారి కనికరించటం లేదు..!

  • కొడంగల్‌లో ముందుకు సాగని అభివృద్ధి పనులు
  • చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారిన కాలనీ రోడ్లు
  • లబోదిబోమంటున్న పట్టణ ప్రజలు
  • మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :

Kodangal : రాష్ట్ర ముఖ్యమంత్రి A. Revanth Reddy సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ను తెలంగాణకే కాకుండా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ, స్థానికంగా అధికారులు – కాంట్రాక్టర్ల నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. వేల కోట్ల రూపాయల నిధులు విడుదలై అభివృద్ధి పనులు ప్రారంభమైనా, వాటి అమలులో నిర్లక్ష్యం, ఆలస్యం, సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పట్టణ ప్రజలు మండిపడుతున్నారు.

పట్టణ అభివృద్ధిపై ఇప్పటికే పలుమార్లు రాష్ట్రస్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్‌లు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, నేలమీద మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను నియమించినా, పనుల్లో ఆశించిన పురోగతి కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పట్టణంలోని పలు అభివృద్ధి పనులను చేపట్టిన ఎస్వీఆర్ సంస్థ సంవత్సరాలుగా పనులు కొనసాగిస్తున్నప్పటికీ, “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే” అన్నట్లుగా పనులు మధ్యలోనే నిలిచిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కాలనీల్లో ఉన్న పాత సీసీ రోడ్లను పూర్తిగా తొలగించి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్‌లైన్‌లు, మ్యాన్‌హోల్ నిర్మాణాలు చేపడతామని చెప్పి తవ్వకాలు ప్రారంభించినప్పటికీ, ఆ పనులు పూర్తి కాక రోడ్లు గుంతలమయంగా మారాయి.

పట్టణంలోని అనేక కాలనీల్లో తవ్విన గోతులు నెలల తరబడి అలాగే ఉండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి ముందు బయటకు రావాలన్నా, పిల్లలను పాఠశాలలకు పంపాలన్నా ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ బురదమయంగా మారిపోవడంతో ద్విచక్ర వాహనదారులు జారి పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల నుంచి వెళ్లే మురుగునీటి పైప్‌లైన్‌లను తొలగించి తిరిగి అమర్చకపోవడంతో మురుగునీరు నేరుగా రోడ్లపైకి చేరుతోంది. దీనికి తోడు వర్షపు నీరు చేరి రహదారులు పూర్తిగా చిత్తడిగా మారుతున్నాయి. ఫలితంగా దుర్వాసన, దోమల సమస్యలు పెరిగి ప్రజల ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతోందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

“దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదు” అన్నట్లుగా ముఖ్యమంత్రి అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నా, స్థానిక స్థాయిలో పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు ఫీల్డ్‌లో కనిపించడం లేదని, కాంట్రాక్టర్లు మాత్రం పనులను ఆలస్యం చేస్తూ కమిషన్ల కోసమే వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలో టీఆర్ఎస్ పాలనలో వేసిన సీసీ రోడ్లు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని, ప్రస్తుతం ఆ రోడ్లను తొలగించి ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టేశారని స్థానికులు విమర్శిస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రారంభించిన పనులు ప్రజలకు శాపంగా మారాయని అంటున్నారు.

పనులు పూర్తి కాకపోవడంతో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు అత్యంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో వీధుల్లో లైటింగ్ సరిగా లేక తవ్విన గోతుల్లో పడిపోతామేమోననే భయంతో ప్రజలు బయటకు రావడానికే వెనుకాడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు కూడా కాలనీల్లోకి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఇప్పటికైనా అధికారులు, కాంట్రాక్టర్లు స్పందించి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు. కొడంగల్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతోందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles