తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, జర్నలిస్టులకు న్యాయం చేయాలి

  • భూపోరాట నాయకుల డిమాండ్
  • జూలై 2న ఉప్పల్ బగాయత్‌లో జరిగే భూపోరాటాన్ని విజయవంతం చేయాలని పిలుపు

కొడంగల్, వికారాబాద్ జిల్లా:

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, కళాకారులు, జర్నలిస్టులు, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని భూపోరాట నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కొడంగల్ పట్టణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భూపోరాట ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్, కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ నీలి జనార్ధన్ లు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జూలై 2న హైదరాబాద్‌లోని ఉప్పల్ బగాయత్‌లో నిర్వహించనున్న భూపోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని రాష్ట్ర సాధన కోసం పోరాడిన వేలాది మంది ఉద్యమకారులు ఇప్పటికీ ప్రభుత్వ గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టు మిత్రులను, ఉద్యమ సమయంలో పాటలు, కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన కళాకారులను, అలాగే తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి గౌరవించాలని వారు కోరారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో ప్రతి అర్హ కుటుంబానికి 250 చదరపు గజాల స్థలాన్ని తక్షణమే కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో కాలయాపన చేస్తోందని, సమస్య పరిష్కారం పేరుతో కమిటీలు వేసి నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని భూపోరాట నాయకులు విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తులను కమిటీల్లో నియమించడం సరైన పద్ధతి కాదని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని కేశవరావును కమిటీలో చేర్చడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

జూలై 2న ఉప్పల్ బగాయత్‌లో నిర్వహించనున్న భూపోరాట కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా, కొడంగల్ నియోజకవర్గం నుండి తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు, కళాకారులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోరే సాయిరాం, జేపీ శ్యామ్ ప్రసాద్, దొబ్బలి రాము, పుల్లని చెన్నయ్య, నరేష్ యాదవ్, భీమయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles