ఎస్‌ఐఆర్‌పై పూర్తి సమాచారం ఇవ్వాలి: కోస్గి బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ వెంకట్ నర్సిములు

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ /కోస్గి, జూన్ 27:

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించి ప్రజలకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు పూర్తి స్థాయిలో మరియు సరైన సమయంలో సమాచారం అందించాలని కోస్గి బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వెంకట్ నర్సిములు అధికారులను కోరారు. శనివారం కోస్గి తహసీల్దార్ కార్యాలయంలో పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయన సమర్పించారు.

ఈ సందర్భంగా వెంకట్ నర్సిములు మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎలాంటి సమాచారం అందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని అన్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్ఏలు) అవసరమైన సమాచారాన్ని నిరంతరం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పాక్షికంగా కొనసాగాలంటే ప్రతి దశలోనూ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమాచారం చేరవేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యం కొనసాగిస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని వెంకట్ నర్సిములు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, చెన్నారం సర్పంచ్ కృష్ణ, సాయప్ప, నీలప్ప, వెంకటేష్, శ్రీశైలం, నర్సింలు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles