- షాద్‌నగర్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం
శ్రీ బల భీమ న్యూస్ / షాద్‌నగర్:
డిజిటల్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటంతోనే సైబర్ మోసాల నుంచి రక్షణ పొందవచ్చని షాద్‌నగర్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీతారాం అన్నారు. షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న చిల్కమర్రి గ్రామంలోని ఎంఎస్ఎన్ సంస్థ ప్రాంగణంలో ఉద్యోగులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం రెండో వారపు “సైబర్ నేరాల అవగాహన కార్యక్రమం” నిర్వహించారు.
“ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో డిజిటల్ భద్రత, ఆర్థిక మోసాల నివారణపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సైబర్ నిపుణులు, పోలీస్ అధికారులు ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాల గురించి వివరించారు.
నకిలీ స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ యాప్‌లు, అధిక లాభాల పేరుతో జరిగే మోసపూరిత స్కీములు, అనధికార డిజిటల్ లోన్ యాప్‌లు, ఫిషింగ్ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకింగ్, వ్యక్తిగత ఖాతాల భద్రత కోసం బలమైన పాస్‌వర్డ్‌లను వినియోగించడంతో పాటు టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలని తెలిపారు.

పబ్లిక్ వై-ఫై ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు చేయవద్దని, అనుమానాస్పద ఎస్ఎంఎస్లు, వాట్సాప్ లింకులను క్లిక్ చేయకూడదని అధికారులు సూచించారు.
మోసానికి గురైతే వెంటనే స్పందించాలి
సైబర్ మోసానికి గురైనప్పుడు ఆలస్యం చేయకుండా “గోల్డెన్ అవర్”లో స్పందించడం అత్యంత కీలకమని పోలీసులు తెలిపారు. బాధితులు వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, అలాగే cybercrime.gov.in వెబ్సైట్లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును ఫ్రీజ్ చేసే అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు వివరించారు.

అనంతరం నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఉద్యోగులు అడిగిన యూపీఐ భద్రత, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో వచ్చే నకిలీ ఉద్యోగ ఆఫర్లు, ఐడెంటిటీ థెఫ్ట్ తదితర అంశాలపై సైబర్ నిపుణులు, పోలీస్ అధికారులు సమాధానాలు ఇచ్చారు.
ప్రతి ఒక్కరూ డిజిటల్ అవగాహన పెంచుకుని సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని షాద్‌నగర్ పోలీసులు కోరారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



