ఈ ఏడాది య‌థావిధిగా ఇంట‌ర్ అడ్మిష‌న్లు…

* పాఠ‌శాల విద్య‌లో ఇంట‌ర్మీడియ‌ట్ విలీనంపై స‌మీక్షించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి
* భాగ‌స్వాముల‌తో విస్తృత సంప్ర‌దింపులు.. శాస‌న‌స‌భ‌లో చ‌ర్చ త‌ర్వాతే నిర్ణ‌యం

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :

హైదరాబాద్‌: ఈ ఏడాది య‌థావిధిగా ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాలు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌వేశాల‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం, ఇంట‌ర్మీడియ‌ట్‌ను పాఠ‌శాల విద్య‌లో విలీనం చేసే ప్ర‌క్రియ‌కు ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌లు అడ్డుగా ఉండ‌డంతో విద్యార్థుల ప్ర‌యోజనాల‌కు భంగం వాటిల్ల‌కుండా వెంట‌నే ప్ర‌వేశాల ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు.

ఇంట‌ర్మీడియ‌ట్ ను ర‌ద్దు చేసి సీబీఎస్ఈలో మాదిరే 11, 12 త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని.. ఫ‌లితంగా డ్రాపౌవుట్స్ సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ని తెలంగాణ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించింది. సీబీఎస్ఈతో పాటు మెజారిటీ రాష్ట్రాలు 11, 12 త‌ర‌గ‌తుల విధానాన్ని అనుస‌రిస్తున్నాయి. మ‌న రాష్ట్రంలో మాత్రం ఇంట‌ర్మీడియ‌ట్ విద్య వేరుగా ఉంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివిన విద్యార్థుల్లో అత్య‌ధికులు ఆ త‌ర్వాత ఇంట‌ర్మీడియ‌ట్‌కు వేరుగా ఉన్న క‌ళాశాల‌ల్లో చేర‌డం లేదు. అప్ప‌టితో విద్య‌ను నిలిపివేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్మీడియ‌ట్‌ను వేరుగా కాకుండా 11, 12 త‌ర‌గ‌తులుగా కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గ‌తంలో అధికారుల‌కు సూచించారు.

ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న్ సైతం త‌న నివేదిక‌లో పేర్కొంది. ఇటీవ‌ల ఇంట‌ర్మీడియ‌ట్‌లో ప్ర‌వేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్ర‌క‌ట‌న విడుదల చేయ‌డంతో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల నుంచి ఆందోళ‌న వ్య‌క్త‌మైంది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఎంపీ వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శేషాద్రి, సీఎం స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ అజిత్ రెడ్డి, సీఎం సెక్ర‌ట‌రీ మాణిక్ రాజ్‌, విద్యా శాఖ క‌మిష‌న‌ర్ యోగితా రాణాల‌తో చ‌ర్చించారు. విలీనంతో ముడిప‌డిన ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌లను క్షుణ్నంగా అధ్య‌య‌నం చేయాల్సి ఉన్నందున ఈ ప్ర‌క్రియ‌ను తాత్కాలికంగా వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించారు. విలీన‌ ప్ర‌క్రియ‌కు సంబంధించి భాగ‌స్వాముల‌తో విస్తృతంగా సంప్ర‌దింపులు నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేష‌న్ పాల‌సీపై నియ‌మించిన క‌మిటీ అధ్య‌య‌నం చేసి త‌న నివేదిక స‌మ‌ర్పించాల‌ని సీఎం సూచించారు. అనంత‌రం శాస‌న‌స‌భ‌లో చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకుందామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles