గుప్త నిధుల తవ్వకాలు!

  • క్షుద్ర పూజలు నిర్వహిస్తూ జేసీబీతో తవ్వకాలు.. ఆరుగురు అరెస్ట్
  • పట్టుబడిన వారిలో సర్పంచ్ భర్త, మాజీ సర్పంచ్ ఉన్నట్లు సమాచారం
  • ముగ్గురు పరార్.. జేసీబీ, రెండు కార్లు సీజ్

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ అక్టోబర్ 6

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం బండమీదిపల్లి గ్రామ సమీపంలో గుప్త నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు జరుపుతున్న ఘటన కలకలం రేపింది. పక్కా సమాచారంతో యాలాల పోలీసులు అర్ధరాత్రి సమయంలో దాడి చేసి తవ్వకాలు నిర్వహిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహిస్తూ జేసీబీ సహాయంతో తవ్వకాలు జరుపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో యాలాల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడగా, మరో ముగ్గురు అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది.

పట్టుబడిన వారిలో ఓ సర్పంచ్ భర్తతో పాటు ఓ గ్రామ మాజీ సర్పంచ్, మరికొందరు ఉన్నట్లు సమాచారం. తవ్వకాల కోసం ఉపయోగించిన జేసీబీతో పాటు రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఘటనాస్థలిని యాలాల ఎస్సై విట్టల్‌రెడ్డి పరిశీలించి, అక్కడి పరిస్థితులపై విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, గుప్త నిధుల తవ్వకాల వెనుక ఉన్న వ్యక్తులు, తవ్వకాల ఉద్దేశ్యం, పరారైన ముగ్గురు వ్యక్తుల ఆచూకీపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles