- అంజయ్య యాదవ్‌కు ఆహ్వాన పత్రికలు
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ అక్టోబర్ 5 :
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామంలోని శ్రీశ్రీశ్రీ అంబాభవాని మాత దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రోత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయ గ్రామ పెద్దలు, కమిటీ నిర్వాహకులు గురువారం ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, జర్నలిస్టులను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్, షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందేమోహన్, మాజీ జడ్పీటీసీ శ్యాంసుందర్‌రెడ్డిలను కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు. అలాగే సీనియర్ జర్నలిస్టులు ఎం.డి. ఖాజాపాషా (కేపీ), కేపీ రాఘవేందర్ గౌడ్, సాయినాథ్రెడ్డిలకు కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. ఖాజాపాషా (కేపీ) ఆలయ అభివృద్ధి, శరన్నవరాత్రోత్సవాల నిర్వహణకు తనవంతు సహకారంగా రూ.5,100 నగదు విరాళం అందజేశారు. ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన ఆకాంక్షించారు.

భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు :
ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే శరన్నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు సుప్రభాతం, 4.30 గంటలకు అభిషేకం, 8 గంటలకు పల్లకి సేవ, 9 గంటలకు మహానైవేద్యం, 10.30 గంటలకు సప్తశతి చండీ హోమం, అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చంద్రయ్య, సర్పంచ్ బుడ్డ నవ కిరణ్ నరసింహ తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు బతుకమ్మ కార్యక్రమం, 6.30 గంటలకు లలితా సహస్రనామ అర్చనలు, రాత్రి 7 గంటలకు మంగళహారతి, 8 గంటలకు భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
రోజుకో ప్రత్యేక అలంకరణ :
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారు వివిధ ప్రత్యేక అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 11న స్వర్ణ కవచాలంకృత దేవి, 12న బాలత్రిపుర సుందరి, 13న గాయత్రీ దేవి, 14న అన్నపూర్ణా దేవి, 15న లలితా త్రిపుర సుందరి, 16న సరస్వతి దేవి, 17న మహాలక్ష్మి దేవి, 18న దుర్గా దేవి, 19న మహిషాసురమర్ధిని దేవి, 20న రాజరాజేశ్వరి దేవి అలంకరణల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 20వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు లేపాక్షి పూజ నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శరన్నవరాత్రోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అంబాభవాని మాతను దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ చైర్మన్, కార్యవర్గ సభ్యులు కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బుడ్డ నవ కిరణ్ నరసింహ, ఉప సర్పంచ్ అభినవ్, మాజీ ఎంపీటీసీ కావలి శ్రీశైలం, మాజీ చైర్మన్ గుల్లే కృష్ణయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు నారం రామ్‌రెడ్డి, బాల్రత్నం గౌడ్, ముత్యాల రాములు, జంగం రవి, కుక్కల మహేష్, వార్డు సభ్యులు గడ్డమీది శ్రీను, గోనెల రాము, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ల యాదయ్య యాదవ్, బద్దుల లక్ష్మయ్య యాదవ్, ఎం.డి. యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.


