శ్రీ బల భీమ న్యూస్ /కొడంగల్, ఆగస్టు 7 (ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) చైర్‌పర్సన్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గౌరవ అధ్యక్షురాలు, ప్రజా యుద్ధభేరి పాటల పెద్దక్క కామ్రేడ్ అరుణోదయ విమలక్క 62వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ ఉద్యమకారులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ఏరన్‌పల్లి శ్రీనివాస్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి చెవిటి అనిత కుమారి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బాధ్యులు కొర్ర పాండు నాయక్ మాట్లాడుతూ, పేదలు, బడుగు-బలహీన వర్గాలు, బహుజనుల హక్కుల కోసం విమలక్క ఎన్నో దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఆమె ప్రజా ఉద్యమాల్లో మరింత చురుకుగా పాల్గొంటూ, సమాజ సేవలో ముందుండాలని ఆకాంక్షిస్తూ మరెన్నో జన్మదిన వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు సూర్య నాయక్, ఎల్‌ఎస్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గోవింద నాయక్, అరుణోదయ కళాకారుడు శంకర్ తదితరులు పాల్గొని విమలక్కకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188




