- నిద్రమత్తులో మంచం పై నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలు..
- హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి
- కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులకు ఫిర్యాదు –
- కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
శ్రీ బల భీమ న్యూస్ /కొడంగల్, జూలై 12 :
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న ఎస్వీకే (SVK) కన్స్ట్రక్షన్ సంస్థలో పనిచేస్తున్న ఓ వలస కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది. అర్థరాత్రి నిద్రమత్తులో మంచం మీద నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడిన కార్మికుడు, వారం రోజుల పాటు హైదరాబాద్‌లో చికిత్స పొందినప్పటికీ ప్రాణాలు నిలువలేకపోయాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఎలాంటి అనుమానాలు లేవని రాతపూర్వకంగా తెలియజేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఖవర్ధా జిల్లా, వీర గ్రామానికి చెందిన ప్రదీప్ కుమార్ (21) జీవనోపాధి కోసం దాదాపు రెండు నెలల క్రితం కొడంగల్ పట్టణానికి వచ్చాడు. ఇక్కడ ఎస్వీకే కన్స్ట్రక్షన్ సంస్థ చేపడుతున్న అభివృద్ధి పనుల్లో రోజువారీ కూలీగా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే ఆశతో స్వస్థలాన్ని వదిలి తెలంగాణకు వచ్చిన యువకుడు అనూహ్య పరిస్థితుల్లో మృతి చెందడం అందరినీ కలచివేసింది.

సంస్థకు చెందిన కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం, గత వారం రోజుల క్రితం ప్రదీప్ కుమార్ రోజంతా కూలి పని చేసి తీవ్ర అలసటతో రాత్రి సుమారు 11 గంటల సమయంలో తన మంచంపై నిద్రించాడు. తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో నిద్రమత్తులో ప్రమాదవశాత్తు మంచం పై నుంచి కిందపడిపోయాడు. కిందపడిన సమయంలో తలకు బలమైన దెబ్బ తగలడంతో పాటు మెడ వెనుక భాగం నుంచి వీపు వరకు కదలికలు లేకుండా పోయాయని సహచరులు గుర్తించారు.

వెంటనే అతడిని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని భావించి మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి (NIMS) తరలించారు. అక్కడ వైద్యులు వారం రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ, శనివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో ప్రదీప్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, తమ కుమారుడు లేదా సోదరుడు నిద్రమత్తులో ప్రమాదవశాత్తు మంచం పై నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడని పేర్కొన్నారు. ఈ ఘటనలో తమకు ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టంగా రాతపూర్వకంగా తెలియజేశారు.
ఈ విషయాన్ని ధృవీకరించిన కొడంగల్ ఎస్సై సత్యనారాయణ మాట్లాడుతూ, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చట్టపరమైన ప్రక్రియ కొనసాగిస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు.

ఇదిలా ఉండగా, ఘటనపై బలభీమా న్యూస్ ప్రతినిధి ఎస్వీకే కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధిని వివరణ కోరగా, మృతుడు గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తర్వాత తెలిసిందని, అయితే ఆ విషయం సంస్థ యాజమాన్యానికి ముందుగా తెలియజేయలేదని వెల్లడించారు. రోజంతా కూలి పని చేసి అలసటతో నిద్రించిన సమయంలో ప్రమాదవశాత్తు మంచం పై నుంచి కిందపడటంతో తలకు తీవ్ర గాయమై, అనంతరం పక్షవాతం వచ్చినట్లు వైద్యులు తెలిపారని వివరించారు.
అలాగే ప్రమాదం జరిగిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించామని తెలిపారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స కోసం దాదాపు రూ.2 లక్షల వరకు వైద్య ఖర్చు చేసినట్లు చెప్పారు.
మృతుడు మరణించిన అనంతరం నిమ్స్ ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యుల సమక్షంలో అంబులెన్స్ ద్వారా ఛత్తీస్‌గఢ్‌లోని స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించామని పేర్కొన్నారు.

అంతేకాకుండా, మృతుడి కుటుంబానికి మానవతా దృక్పథంతో మరో రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. వలస కార్మికుడి మృతి పట్ల సంస్థ యాజమాన్యం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపింది.
ఈ విషాదకర ఘటనతో కొడంగల్‌లో పనిచేస్తున్న ఇతర వలస కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉపాధి కోసం స్వస్థలాలను విడిచి ఇతర రాష్ట్రాలకు వచ్చే కార్మికుల భద్రత, ఆరోగ్య పరిస్థితులు, వసతి సౌకర్యాలపై మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



