శ్రీ బల భీమ న్యూస్ /కొడంగల్, జూలై 1:
గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందిన విషాద ఘటన మంగళవారం రాత్రి పట్టణ శివారులోని బండల ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఉన్న హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కొడంగల్ ఎస్సై జి.వి. సత్యనారాయణ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, గుర్తు తెలియని ఓ వృద్ధుడు మంగళవారం రాత్రి జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసు సిబ్బంది సహకారంతో కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టం గదికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సమీప పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



