పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

  • కొడంగల్‌లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాల్లో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్, జూలై 1 (ప్రతినిధి):

రాష్ట్రంలోని పేద, నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ పేర్కొన్నారు. బుధవారం కొడంగల్ మండల పరిధిలోని పోచమ్మ తండాకు చెందిన మెగావత్ శంకర్ నాయక్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని తండా సర్పంచ్ మూడవత్ సునీత రాజు సమక్షంలో ఆయన ఘనంగా ప్రారంభించారు. అనంతరం పర్సాపూర్ లో  సర్పంచ్ కన్నం రాధా శ్రీనివాస్ రెడ్డి  , పాత కొడంగల్ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను  మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ సమక్షంలో ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా  మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతి రెడ్డి ప్రత్యేక కృషితో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు.

గతంలో ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు కోసం ఎదురుచూసిన పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాకిరణంగా నిలిచిందని పేర్కొన్నారు.

 

ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో లబ్ధిదారులు ఆధునిక సౌకర్యాలతో కూడిన మోడల్ ఇండ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకుంటుండటం ఆనందంగా ఉందన్నారు. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. కేవలం గృహ నిర్మాణమే కాకుండా గ్రామాల్లో రహదారులు, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్, డ్రైనేజీ తదితర అభివృద్ధి కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయని వివరించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన నందారం ప్రశాంత్, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన నాయకులు తమ వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. పది సంవత్సరాలపాటు ప్రజలను మాయమాటలతో నమ్మించి అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఏ ముఖంతో గ్రామాల్లోకి వస్తున్నారని ప్రశ్నించారు.

f

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా పాలనకు శ్రీకారం చుట్టి సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులు, మహిళలు, యువత, నిరుపేద కుటుంబాలు, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రైతన్నలకు రైతు భరోసా, మహిళలకు పలు సంక్షేమ పథకాలు, పేదలకు ఇందిరమ్మ ఇండ్ల వంటి కార్యక్రమాలు ప్రభుత్వం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని అన్నారు.

కొడంగల్ నియోజకవర్గం ప్రస్తుతం అభివృద్ధిలో దూసుకుపోతోందని, ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత మద్దతు అందించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో MPO జైపాల్ రెడ్డి, పర్సాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, పోచమ్మ తండా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు నాయక్, ఉపసర్పంచ్ శంకర్ నాయక్, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles