కొడంగల్‌లో అభివృద్ధి శూన్యం..

  •  సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు:
  • ఎంఐఎం నేత ఎస్‌బీ గుల్షన్

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ , జూన్ 20:

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో అభివృద్ధి పూర్తిగా శూన్యంగా మారిందని ఎంఐఎం పార్టీ కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్‌బీ గుల్షన్ తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం కొడంగల్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

గత తొమ్మిది నెలల క్రితం అభివృద్ధి పేరుతో అంబేద్కర్ చౌరస్తా సమీపంలోని బస్టాండ్ ముందు చిరు వ్యాపారులు జీవనోపాధిగా నిర్వహిస్తున్న దుకాణాలు, డబ్బాలను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తొలగించారని ఆరోపించారు. దీంతో వందలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పేదల పొట్టకొడుతుందని, వారికి సరైన పునరావాసం కల్పించకుండా రోడ్డున పడేసిందని మండిపడ్డారు.

అదే విధంగా రోడ్డు విస్తరణ పనుల పేరుతో అర్థరాత్రి సమయంలో మతపరమైన స్థలాలకు సంబంధించిన దర్గా, ఆశూర్ ఖానా, స్మశానవాటికల ప్రహరీ గోడలను తొలగించారని ఆరోపించారు. ఈ చర్యల వల్ల మైనారిటీ వర్గాల మనోభావాలు దెబ్బతిన్నాయని, ప్రజల్లో తీవ్ర ఆవేదన నెలకొందన్నారు.

ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి వివరించామని, తొలగించిన మతస్థలాలను తిరిగి పునర్నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఆ హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

కొడంగల్‌ను సిరిసిల్ల, సిద్ధిపేట, గజ్వేల్ మాదిరిగా అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కొడంగల్ మున్సిపాలిటీలో గణనీయమైన అభివృద్ధి కనిపించడం లేదన్నారు. అభివృద్ధి పనులు కేవలం ప్రకటనలు, కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు.

ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టి, రహదారుల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ, తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అభివృద్ధి పేరుతో కూల్చివేతలు చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఎక్కడా కనిపించడం లేదని ఆరోపించారు.

మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటోందని ఎస్‌బీ గుల్షన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, గెలిచిన తర్వాత వారి సమస్యలను పూర్తిగా విస్మరిస్తోందన్నారు. మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వం చెప్పుకున్న పథకాలు కూడా కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆరోపించారు.

తొలగించిన మతస్థలాల పునర్నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వారం రోజులలోపు యథాస్థానంలో దర్గా, ఆశూర్ ఖానా మరియు ఇతర మతపరమైన నిర్మాణాలను పునర్నిర్మించేందుకు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు ప్రకటించాలని కోరారు. లేని పక్షంలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంఐఎం పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, కొడంగల్ అభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎంఐఎం నాయకులు ఎండీ సర్తాజ్ హుసేన్, సయ్యద్ అర్షద్ అలీ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles