- పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు:
- కొడంగల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతి రెడ్డి
శ్రీ బల భీమ న్యూస్ /కొడంగల్, జూన్ 5:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతి రెడ్డి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజా నేతృత్వంలో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, ఇప్పటివరకు పూర్తి కావాల్సిన అనేక ప్రాజెక్టులు ఆలస్యమవుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మొదటగా బొంరాస్‌పేట్ మండలంలో నిర్మాణంలో ఉన్న మహిళా గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల భవనాల పనులను పరిశీలించిన తిరుపతి రెడ్డి, పనుల పురోగతిపై అధికారులను ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

అనంతరం కొడంగల్ మండల పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల భవనాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులతో పాటు కాంట్రాక్టర్లను నిలదీసిన ఆయన, పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయో వివరణ కోరారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, ఇకపై మరింత జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.
పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని స్పష్టం చేసిన తిరుపతి రెడ్డి, నాసిరకం నిర్మాణాలకు తావులేకుండా నాణ్యమైన సామగ్రితో పనులు చేపట్టాలని సూచించారు. ప్రజల పన్నుల రూపంలో వచ్చే నిధులతో నిర్మాణాలు జరుగుతున్నందున ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని అన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు.
ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు స్పందిస్తూ మరో రెండు నుంచి మూడు నెలల వ్యవధిలో అన్ని పనులను పూర్తి చేసి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. అధికారులు కూడా అలసత్వం వీడి పనుల పర్యవేక్షణను మరింత ముమ్మరం చేయాలని తిరుపతి రెడ్డి సూచించారు.

ఇదే క్రమంలో కొడంగల్ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా భూమిపూజ చేసి పనులను ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకు పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
ఆలయ పునర్నిర్మాణం కొడంగల్ పట్టణ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్న తిరుపతి రెడ్డి, ఈ పనులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని వేగవంతం చేయాలని అధికారులను కోరారు. ఆలయ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌కు కొత్త శోభ చేకూరడమే కాకుండా భక్తుల సంఖ్య కూడా పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
అలాగే ఆలయ నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన సూచించారు. పునరావాసం, పరిహారం తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను పూర్తి చేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని, వాటి ఫలితాలు ప్రజలకు త్వరగా అందేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని తిరుపతి రెడ్డి కోరారు. కొడంగల్‌ను రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్, మాజీ ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్, కోస్గి మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్, సర్పంచులు, మాజీ సర్పంచులు, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆసిఫ్ అలీ,బొంరాస్ పేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింహులు గౌడ్, కోస్గి మండల అధ్యక్షుడు రఘువీర్ రెడ్డి kada ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



