మైనర్ బాలికను వివాహం చేసుకున్న కానిస్టేబుల్‌పై కేసు

  • చట్టాన్ని కాపాడాల్సిన పోలీసే నిందితుడిగా మారిన ఘటన..
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :

యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. చట్టాన్ని అమలు చేయాల్సిన ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్‌నే మైనర్ బాలికను వివాహం చేసుకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చతెచ్చేలా జరిగిన ఈ ఘటనపై మహిళా సంఘాలు, బాలల హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సమాచారం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నాయిని అనిల్ కుమార్ గౌడ్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఈ నెల 9వ తేదీన అనంతగిరి మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను రహస్యంగా అర్ధరాత్రి సమయంలో వివాహం చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వివాహం అత్యంత గోప్యంగా నిర్వహించబడినట్లు తెలుస్తోంది.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ముఖ్యంగా చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ సిబ్బందే బాల్య వివాహానికి పాల్పడటం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధిక కట్నం ఆశతోనే మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. బాలిక వయస్సు చట్టపరమైన వివాహ వయస్సుకు చేరకపోయినా వివాహం జరపడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ఈ విషయమై శిశు సంక్షేమ శాఖ అధికారులు స్పందించారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేపట్టి హుజూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నాయిని అనిల్ కుమార్ గౌడ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. బాల్య వివాహ నిరోధక చట్టం, బాలల రక్షణకు సంబంధించిన నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ఇక ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి, నిందితుడిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరోవైపు బాలిక భద్రత, భవిష్యత్తు విద్యపై కూడా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

సమాజంలో బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ప్రభుత్వం, అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు చట్టాలను ఉల్లంఘించడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles