రైతులకు అండగా పోలీస్ యంత్రాంగం

  • వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు,
  • రైస్ మిల్లులపై జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు
  • జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, IPS ఆదేశాలతో పోలీస్
  • రెవెన్యూ–వ్యవసాయ శాఖల సమన్వయ చర్యలు

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS గారి ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ అధికారులు రెవెన్యూ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వివిధ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు (PPCలు) మరియు రైస్ మిల్లులను విస్తృతంగా సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ, రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు సక్రమంగా కొనుగోలు చేయించే దిశగా పోలీస్ శాఖ అన్ని విధాల సహకారం అందిస్తోందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా, మధ్యవర్తుల జోక్యం లేకుండా, పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగేందుకు ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద అధిక రద్దీ, ట్రాఫిక్ సమస్యలు, ధాన్యం రవాణాలో జాప్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వ్యాప్తంగా డీఎస్పీ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ పికెటింగ్, నిరంతర గస్తీ, పర్యవేక్షణ చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో భాగంగా తాండూర్ డీఎస్పీ కాశింపూర్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తూకం, రవాణా, చెల్లింపుల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులకు సూచనలు చేశారు.

పరిగి డీఎస్పీ సుల్తాన్‌పూర్ కొనుగోలు కేంద్రంతో పాటు శ్రీ వెంకట సాయి రైస్ మిల్లును తనిఖీ చేసి ధాన్యం నిల్వలు, తూకం ప్రక్రియ, రవాణా సౌకర్యాలు, తేమ శాతం పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. రైతుల ధాన్యాన్ని ఆలస్యం లేకుండా స్వీకరించాలని మిల్లర్లకు సూచించారు.

దౌల్తాబాద్ ఎస్.హెచ్.ఓ గోక ఫసల్వాద్‌లోని రైస్ మిల్లును సందర్శించి ధాన్యం నిల్వ పరిస్థితులను పరిశీలించగా, పెద్దేముల్ ఎస్.ఐ మాంబాపూర్‌లోని శ్రీ అన్నదాత రైస్ మిల్లును అధికారులతో కలిసి తనిఖీ చేసి ధాన్యం అన్‌లోడింగ్, నిల్వల నిర్వహణ, రవాణా ప్రక్రియలపై మార్గదర్శకాలు జారీ చేశారు.

అలాగే కొడంగల్ సి.ఐ మరియు దుద్యాల్ ఎస్.ఐ గౌరారంలోని శ్రీ సాయి పారా బాయిల్డ్ ఇండస్ట్రీతో పాటు కొడంగల్‌లోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లులను సందర్శించి యాజమాన్యాలతో సమావేశమయ్యారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే స్వీకరించాలని, నిల్వలు పెండింగ్‌లో ఉంచవద్దని సూచించారు.

మోమిన్‌పేట ఎస్.ఐ మేకవనంపల్లిలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించగా, యాలాల ఎస్.ఐ శ్రీ బాలాజీ రైస్ మిల్లును పరిశీలించి పాత ధాన్యం నిల్వల క్లియరెన్స్, కొత్త ధాన్యం సేకరణ, తేమ శాతం పరీక్షలు, తూకం ప్రక్రియ, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను తనిఖీ చేశారు.

జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రశాంతంగా, నియంత్రణలో కొనసాగుతోందని జిల్లా పోలీస్ యంత్రాంగం వెల్లడించింది. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన విధానాల ప్రకారం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు, అవకతవకలు, ఆలస్యాలు లేదా మధ్యవర్తుల ఇబ్బందులు ఎదురైనా వెంటనే సమీప పోలీస్ అధికారులకు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని జిల్లా పోలీస్ శాఖ రైతులకు సూచించింది. రైతుల ప్రయోజనాల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా స్పష్టం చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles