- యాలాల మండలం తిమ్మాయపల్లి గ్రామంలో పశు వైద్య శాఖ ప్రత్యేక కార్యక్రమం
శ్రీ బల భీమా న్యూస్ / యాలాల్ :
తిమ్మాయపల్లి : గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో యాలాల మండలం తిమ్మాయపల్లి గ్రామంలో శుక్రవారం పశువులకు నట్టల నివారణ మందులు మరియు రోగ నిరోధక వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. పశు వైద్య అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి, ఉప సర్పంచ్ కొత్తింటి నర్సింలు ముఖ్యంగా హాజరై రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పశుసంపద రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. ప్రతి రైతు తమ పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పశు వైద్య అధికారులను సంప్రదించాలని సూచించారు. పశువులకు సరైన సమయంలో వ్యాక్సిన్లు వేయడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.

ఉప సర్పంచ్ కొత్తింటి నర్సింలు మాట్లాడుతూ ప్రస్తుతం పశుసంపద తగ్గుముఖం పడుతున్న పరిస్థితుల్లో పశువుల సంరక్షణ ఎంతో అవసరమన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే రైతులు పశుసంపదను కూడా సమానంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా వర్షాకాలం రాకముందే నట్టల నివారణ మందులు వేయడం వల్ల పశువులు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొట్టు నర్సింలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపద అభివృద్ధి రైతుల జీవనోపాధికి ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పశుసంవర్థక కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశువుల ఆరోగ్య పరిరక్షణ ద్వారా రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

పశువైద్యాధికారి మరియు సిబ్బంది రైతులకు పశువుల సంరక్షణ, వ్యాధుల నివారణ చర్యలు, శుభ్రత పాటించాల్సిన విధానం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పశువులకు ఎటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి, కాంపౌండర్ శ్రీనివాస్, తాండూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏం రాజు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు ఏ భీమయ్య, గ్రామ కార్యదర్శి చంద్రశేఖర్, రైతులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



