- కొడంగల్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా, తహసీల్దార్‌కు వినతిపత్రం
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్, జూన్ 2:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించిన అభయ హస్తం మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం కొడంగల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఈ ఆందోళన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా సంఘం నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న దివ్యాంగులు మరియు సంఘం నాయకులు అరగుండు కొట్టించుకుని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను గుర్తు చేశారు.

ఈ సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించి అనేక హామీలు ఇచ్చినప్పటికీ వాటి అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. దివ్యాంగుల పెన్షన్ పెంపు, ఉపాధి అవకాశాలు, ప్రత్యేక సంక్షేమ పథకాలు, విద్య మరియు ఆరోగ్య రంగాల్లో ప్రత్యేక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు మాట్లాడుతూ, దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీల అమలుకు కార్యాచరణ ప్రకటించాలని కోరారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
ధర్నా అనంతరం దివ్యాంగుల ప్రతినిధి బృందం కొడంగల్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం సమర్పించింది. దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పసుల చెంద్రయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు నరేష్, సూర్యాపేట జిల్లా నాయకులు శివ, కొడంగల్ నాయకులు లక్ష్మణ్ గౌడ్, అలవేలు తదితర నాయకులతో పాటు వివిధ మండలాలకు చెందిన దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



