విద్యార్థినుల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

బొంరాస్‌పేట, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మండల సభలను వేదికగా చేసుకుంటున్నామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి స్పష్టం చేశారు. గురువారం బొంరాస్‌పేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన మండల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి 99 రోజుల కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ వంద శాతం ప్రభుత్వ పథకాలు అందుతాయని, మండల జనాభా ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ సభలు ఏర్పాటు చేశామని, గ్రామస్తులు తమ రోడ్లు, భూ సర్వే, పంచాయతీ, మండల అభివృద్ధికి సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

సమావేశం అనంతరం కలెక్టర్ బొంరాస్‌పేటలోని గిరిజన గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల విద్య మరియు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. పాఠశాల ఆవరణ, తరగతి గదులను నిశితంగా పరిశీలించిన కలెక్టర్, బోధనా విధానాన్ని సమీక్షించారు. విద్యార్థినులతో నేరుగా ముచ్చటించి వారి చదువు, సౌకర్యాలు, ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థినికి నాణ్యమైన విద్యనందించడంతో పాటు వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. పాఠశాలలో పరిశుభ్రత, పోషకాహారం, తాగునీరు, వసతి సౌకర్యాల విషయంలో ఎటువంటి లోపాలు ఉండకూడదని, ఆరోగ్య పరీక్షలను నిరంతరం నిర్వహిస్తూ విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది మరియు విద్యార్థుల హాజరు రిజిస్టర్లను కూడా ఆయన స్వయంగా తనిఖీ చేశారు.

విద్యార్థినుల వ్యక్తిగత అభివృద్ధి, క్రమశిక్షణ మరియు నైపుణ్యాల పెంపుపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులతో మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో ఇళ్లకు వెళ్లినప్పుడు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. వచ్చే ఏడాది పదో తరగతికి వెళ్లనున్నందున, ముందుగానే సిలబస్ పై దృష్టి సారించి బాగా చదువుకోవాలని ఆదేశించారు. తనిఖీలో భాగంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన కలెక్టర్, విద్యార్థినులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. భోజనం నాణ్యతను స్వయంగా పరీక్షించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధీర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ వెంకన్న గౌడ్, సర్పంచ్ వీరేశం, ఎంఈఓ హరిలాల్, వార్డెన్ రాజన్న, ఎంపీఓ రవి, ఉపాధ్యాయులు, జిల్లా అధికారులు, పాఠశాల సిబ్బంది మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి, వికారాబాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles