- కొనుగోలు కేంద్రాల నిర్వహణపై అధికారులకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా వేగంగా సేకరించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం యాలాల మండల పరిధిలోని అగనూర్, లక్ష్మీనారాయణపూర్, బెన్నూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. కేంద్రాల వద్ద రైతులకు అందుతున్న సౌకర్యాలు, ధాన్యం నిల్వ విధానం, రవాణా ఏర్పాట్లు, తూకాల ప్రక్రియ తదితర అంశాలను ఆయన సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేసవి తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు ఎండదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రైతుల కోసం షామియానాలు ఏర్పాటు చేసి నీడ కల్పించడంతో పాటు, తాగునీటి సౌకర్యం, విశ్రాంతి కోసం కూర్చునే ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు.
రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని ఒకే చోట కుప్పగా నిల్వ చేయకుండా, సక్రమంగా డంపింగ్ చేసే స్థలాన్ని ముందుగానే గుర్తించాలని సూచించారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాలు వచ్చినా ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీల కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.
పరిశీలన సందర్భంగా పలువురు రైతులు కలెక్టర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. ముఖ్యంగా ధాన్యం తూకాల సమయంలో క్వింటాల్‌కు నాలుగు కిలోల వరకు కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పారదర్శకంగా తూకాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. రైతుల శ్రమకు తగిన గౌరవం ఇవ్వాలని, కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల ధాన్య కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో యాలాల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో, ఐకేపీ సిబ్బంది, పౌర సరఫరాల శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
|
మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి |
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



