ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కొడంగల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ ఆగస్టు 19

కొడంగల్: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొడంగల్ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కొడంగల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాథోడ్ రవి, వైస్ ప్రెసిడెంట్ అంజి, ఫోటోగ్రాఫర్ సభ్యులు నరేష్, రాము, శివ, అనిల్, అశోక్ తదితర ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు రాథోడ్ రవి మాట్లాడుతూ, నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అధునాతన కెమెరాలు, మొబైల్ టెక్నాలజీ వంటి ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ, ఫోటోగ్రఫీని వృత్తిగా నమ్ముకుని ఎంతో మంది ఫోటోగ్రాఫర్లు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి తమ వ్యాపారాలను కొనసాగిస్తూ కుటుంబాలను పోషిస్తున్నారని తెలిపారు.

వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, సినిమాటిక్ ఫోటోగ్రఫీ, వీడియో గ్రాఫీ, ప్రీ-వెడ్డింగ్ షూట్స్ వంటి రంగాల్లో ఫోటోగ్రాఫర్లు నిరంతరం కష్టపడుతూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా కేవలం వేడుకలకు మాత్రమే పరిమితం కాకుండా సమాజానికి తమ వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

అసోసియేషన్ అధ్యక్షులు రాథోడ్ రవి మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటి పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఫోటోగ్రాఫర్లు తమ బిజినెస్‌ను మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన సూచనలు, కస్టమర్లతో మంచి సంబంధాలు ఎలా కొనసాగించాలి, వృత్తిలో నాణ్యతను ఎలా పెంచుకోవాలి అనే అంశాలపై సభ్యులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఫోటోగ్రాఫర్ల సమస్యలను తమ సమస్యలుగా భావించి, అందరూ ఐక్యంగా పనిచేస్తే మరింత అభివృద్ధి సాధించవచ్చని రాథోడ్ రవి పేర్కొన్నారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం భవిష్యత్తులో కూడా అవసరమైన కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల ఫోటోగ్రాఫర్లు మరియు ఆసుపత్రి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles