పోచమ్మ తండాలో అంగన్‌వాడీ చిన్నారులకు యూనిఫామ్‌ల పంపిణీ

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ ఆగస్టు 14

కొడంగల్ మండల పరిధిలోని పోచమ్మ తండాలో అంగన్‌వాడీ చిన్నారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న యూనిఫామ్‌లను శుక్రవారం గ్రామ సర్పంచ్ మూడవత్ సునీత రాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న అంగన్‌వాడీ చిన్నారులకు యూనిఫామ్‌లను అందించడం ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులకు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రోజురోజుకూ మరింత బలోపేతం అవుతోందని పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు బదులుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివించేందుకు ఆసక్తి చూపడం హర్షణీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వాల్య శంకర్ నాయక్, అంగన్‌వాడీ టీచర్ కమల, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థులు, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles