కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ అక్టోబర్ 5 :
గిరిజన తండాల సమగ్ర అభివృద్ధే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయమని కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి అన్నారు. సోమవారం దుద్యాల మండలంలోని శెట్టిపల్లి తండాలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని సర్పంచ్ గోపాల్ సమక్షంలో ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. తండాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తండా సర్పంచ్ సీపీఐ పార్టీకి చెందిన అభ్యర్థి అయినప్పటికీ, రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుటి శేఖరయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్నం అంబయ్య గౌడ్, వైస్ చైర్మన్ వేణుగోపాల్, బొమ్మరేస్పేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింలు గౌడ్, కడ ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి, సీపీఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


