కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి

  • వర్షానికి ఇల్లు కూలి నిరాశ్రయమైన కుటుంబాన్ని పరామర్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి

శ్రీ బల భీమ న్యూస్ /వికారాబాద్, జూలై 27:

గత రాత్రి కురిసిన వర్షాల కారణంగా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు గిరిగెటిపల్లిలో ఓ నివాస గృహం కూలిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో కురిసిన వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో నష్టం సంభవించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఇంటి పరిస్థితిని పరిశీలించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ద్వారా అందే సహాయాన్ని త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా అర్థ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉంటారని, వర్ష బాధిత కుటుంబానికి అవసరమైన తక్షణ సహాయం అందించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. నష్టపోయిన బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

వీరితో పాటు మాజీ కౌన్సిలర్ రెడ్యా నాయక్, బుచ్చయ్య, నరసింహులు, రెడ్డి శేఖర్, వడ్డే శ్రీను, కురువ వెంకటయ్య తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles