ఎరుకల కులాలకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి

  • ఏకలవ్యుడి జయంతి సందర్భంగా కొడంగల్‌లో ఎరుకల సంఘాల డిమాండ్
  •  కమ్యూనిటీ హాళ్లు, ఉపాధి, రుణాలు, పందుల పెంపకానికి ప్రత్యేక పథకాలు కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి

శ్రీ బల భీమ న్యూస్ /కొడంగల్, జూలై 25 (ప్రతినిధి):

ఎస్టీ జాబితాలో ఉన్న ఎరుకల కులాలకు రాజకీయంగా ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఎరుకల సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఏకలవ్యుడి జయంతి సందర్భంగా కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన భారీ సమావేశంలో వారు ఈ మేరకు తీర్మానం చేశారు.

అంతకుముందు స్థానిక మహాదేవుడు ఆలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఎరుకల సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో జెండాలు, ప్లకార్డులు పట్టుకుని “ఎరుకల కులాలకు న్యాయం చేయాలి”, “ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి”, “ఎరుకల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు తీసుకురావాలి” అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో నాయకులు ప్రభుత్వానికి పలు డిమాండ్లను వినిపించారు.

సభలో మాట్లాడిన ఎరుకల సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, ఎస్టీ జాబితాలో ఉన్నప్పటికీ రాజకీయంగా తాము తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బంజారా, ఎరుకల కులాలను ఒకే రిజర్వేషన్ పరిధిలో చేర్చడం వల్ల రాజకీయ అవకాశాలు ఎరుకల సమాజానికి అందడం లేదని పేర్కొన్నారు. అందువల్ల ఎరుకల కులానికి ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థలు, శాసనసభ, పార్లమెంట్ స్థాయిల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కొడంగల్ నియోజకవర్గంలో సుమారు 5 వేల ఎరుకల కుటుంబాలు, 20 నుంచి 30 వేల వరకు జనాభా నివసిస్తున్నప్పటికీ వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదని నాయకులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో తమకు శాశ్వత సమావేశాల కోసం సరైన వసతి కూడా లేకపోవడంతో ప్రతి మండలంలో ఒక కమ్యూనిటీ హాల్, అదేవిధంగా నియోజకవర్గ కేంద్రంలో అన్ని కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన భారీ కమ్యూనిటీ హాల్‌ను ప్రభుత్వం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

తమ సంప్రదాయ వృత్తి అయిన బుట్టలు అల్లే వృత్తి పూర్తిగా అంతరించిపోవడంతో వేలాది కుటుంబాలు జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు తెలిపారు. సంప్రదాయ వృత్తులకు ప్రోత్సాహం లేకపోవడం, మార్కెట్ అవకాశాలు తగ్గిపోవడం వల్ల యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక ఉపాధి పథకాలు ప్రవేశపెట్టి, స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు అందించాలని కోరారు.

 

ఎరుకల కుటుంబాల జీవనాధారంగా ఉన్న పందుల పెంపకానికి ప్రత్యేక పథకం రూపొందించి, షెడ్లు నిర్మించేందుకు ఆర్థిక సహాయం, పశువైద్య సేవలు, మేత సదుపాయం, బ్యాంకు రుణాలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. పందుల పెంపకం ద్వారా అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నప్పటికీ ప్రభుత్వ సహకారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ, కొడంగల్ ఆయన సొంత నియోజకవర్గం కావడంతో ఎరుకల కులాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రతి మండలంలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించడంతో పాటు నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు, విద్యార్థులకు హాస్టల్ సదుపాయాలు, విద్యా ప్రోత్సాహక పథకాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

ఎరుకల సమాజం అభివృద్ధి చెందితేనే గిరిజన సమాజం సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుని ప్రత్యేక అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలని కోరారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఎరుకల సంఘాల నాయకులు కిష్టప్ప, చంద్రప్ప, శ్రీనివాస్, రమేష్, అంజి, వెంకట రాములు, వెంకటేశ్వర్లు, బీములు, వినోద్, పాండు, బాలరాజ్, ఎల్లప్ప, కృష్ణ, నాగరాజు, హనుమప్ప, వెంకటప్ప, బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, వృద్ధులు హాజరై ఏకలవ్యుడికి నివాళులర్పించారు. దాదాపు వందలాది మంది ఎరుకల సంఘ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles