అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపం

  • మండుటెండలో తాగునీటికి తీరని కష్టాలు
  • కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ధ్వంసమైన పైప్‌లైన్లు 
  • ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు

శ్రీ బలబీమ న్యూస్, కొడంగల్ :
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డు పాత కొడంగల్ గ్రామ ప్రజలు మండుటెండల్లో మంచినీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. గ్రామంలో మిషన్ భగీరథ పైప్‌లైన్ ధ్వంసం కావడం, మరమ్మత్తులు ఆలస్యం కావడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గ్రామంలో నాలుగు రోజులుగా సరైన తాగునీటి సరఫరా లేకపోవడంతో మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొంతమంది ప్రజలు వ్యవసాయ పొలాల్లో ఉన్న బోర్లు, మోటార్ల వద్దకు వెళ్లి రాత్రింబవళ్లు నీళ్లు తెచ్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి కొరత మరింత ఆందోళన కలిగిస్తోంది.

ఈ సమస్యపై “శ్రీ బలబీమ న్యూస్” ప్రత్యేక కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించారు. గ్రామానికి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అందించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న విధానం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకే ట్యాంకర్‌ను కౌన్సిలర్ ఇంటి వద్ద నిలిపి అక్కడికే ప్రజలు వచ్చి నీళ్లు తీసుకెళ్లాలని చెప్పడం వల్ల పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

నీళ్ల కోసం మహిళలు గంటల తరబడి బిందెలతో క్యూలో నిలబడాల్సి వస్తోందని, చిన్నపిల్లలు సైతం మండుటెండలో నీటి కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నీళ్ల కోసం తోపులాటలు, వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. ప్రతి కాలనీకి, ప్రతి వీధికి విడివిడిగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తే ప్రజలకు ఇబ్బందులు తగ్గుతాయని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో రోడ్ల తవ్వకాలు నిర్వహించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మంచినీటి పైప్‌లైన్లు పగిలిపోయాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. పైప్‌లైన్ దెబ్బతిన్న విషయం తెలిసినా అధికారులు, కాంట్రాక్టర్లు వెంటనే స్పందించకపోవడం పరిస్థితిని మరింత విషమం చేసిందని విమర్శిస్తున్నారు. కొంతమంది కాంట్రాక్టర్లకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పనులు కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు.

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టకుండా అభివృద్ధి పనులు చేయడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ కేంద్రంలోనే తాగునీటి కోసం ప్రజలు ఇంతగా ఇబ్బందులు పడుతుండటం అధికారుల పనితీరుపై అనేక అనుమానాలు కలిగిస్తోందని చెబుతున్నారు.

పగిలిపోయిన పైప్‌లైన్లను వెంటనే మరమ్మత్తు చేసి ప్రతి ఇంటికి క్రమబద్ధమైన నీటి సరఫరా అందించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మండుటెండల్లో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి వెంటనే ఉన్నతాధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం పాత కొడంగల్ గ్రామంలో నెలకొన్న పరిస్థితులు ప్రజల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles