మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి
శ్రీ బల భీమ న్యూస్ /కొడంగల్ ఆగస్టు 29 :
పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు మండల, గ్రామ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో, కొడంగల్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డి ఆదేశాల మేరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
శనివారం కొడంగల్ పట్టణంలోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మండల పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మండల పార్టీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షుడిగా సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులుగా సంతోష్ కుమార్, వాటిమీదపల్లి బాలరాజ్, అప్పయ్యపల్లి శంకర్ నాయక్, చాకలి పకీరప్పలను ఎన్నుకున్నారు. జనరల్ సెక్రటరీలుగా కట్టెపల్లి రాములు, వన్నె బసవరాజ్, జాయింట్ సెక్రటరీలుగా ప్రకాష్, నాయకోటి నర్సింలు, చాకలి శ్రీనివాస్, పీఆర్వో/పాయింట్ పర్సన్‌గా జి. రాము, ట్రెజరర్‌గా సంజీవ్ ఎంపికయ్యారు.
మండల కమిటీ సభ్యులుగా పాండు, ఆనంద్, ఏ. అశోక్, తిరుపతయ్య గౌడ్, దుద్యాల కళావతి, ఆశమ్మ, రాములమ్మ, సోనీబాయి, బర్త్‌డే అనిత, గొల్ల వెంకటయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మీడియా ఇన్చార్జిగా పొడుగంటి నరేష్, ఏ. నవీన్ కుమార్‌లను ఎంపిక చేశారు.
అదేవిధంగా ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా అంజిలప్ప, ఉపాధ్యక్షుడిగా అబ్దుల్ అప్పలను, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా రాజు నాయక్, ఉపాధ్యక్షుడిగా భీమ్ శనగలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
బీసీ సెల్ అధ్యక్షుడిగా కుమ్మరి భీమప్ప, ఉపాధ్యక్షుడిగా తిన్నాలను, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా సయ్యద్ అభి, ఉపాధ్యక్షుడిగా యూనివర్సిటీని మండల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులంతా సమన్వయంతో పనిచేస్తూ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని కోరారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.


