“మమ్మల్ని ఆపేదెవరు?” అంటూ సవాల్..

  • కొడంగల్‌లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ ఇసుక దుకాణాలు!
  • లక్షల్లో మామూళ్లు అందుతున్నాయంటూ బహిరంగ ప్రచారం..
  • కన్నెత్తి చూడని అధికారులు.. అర్ధరాత్రి వేళల్లో జోరుగా అక్రమ రవాణా

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ , జూన్ 29:

“మమ్మల్ని ఆపేదెవరు?” అంటూ బహిరంగంగా సవాల్ విసురుతూ కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో అక్రమ ఇసుక వ్యాపారులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న అక్రమ ఇసుక దుకాణాలు అధికార యంత్రాంగానికి సవాల్ విసురుతున్నా, సంబంధిత శాఖల అధికారులు మాత్రం చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొడంగల్ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందని స్థానికులు, ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఏ ఒక్క అధికారి కూడా కఠిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

మామూళ్లే మా లైసెన్సులు” అంటూ దర్జా

అక్రమ ఇసుక వ్యాపారులు తమకు పలు శాఖల అధికారులకు లక్షల రూపాయల్లో మామూళ్లు అందిస్తున్నామని, తమ వ్యాపారానికి ప్రత్యేక లైసెన్సులు అవసరం లేదని బహిరంగంగా ప్రచారం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. “మేము చెల్లించే మామూళ్లే మా లైసెన్సులు” అంటూ దర్జాగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ అక్రమ వ్యవహారాల కారణంగా ప్రభుత్వ నిబంధనలు, వాల్టా చట్టాలు, మైనింగ్ నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కబడుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఇప్పటివరకు ఎటువంటి కఠిన చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అభివృద్ధి పనుల పేరుతో అక్రమాలకు ఆస్కారం

కొడంగల్ నియోజకవర్గంలో ప్రస్తుతం భారీ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, మెడికల్ కాలేజీ నిర్మాణం, ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు అవసరమైన ఇసుకను బొంరాస్పేట మండలం నుంచి అధికారికంగా సరఫరా చేసేందుకు జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి తహసీల్దార్ స్థాయి వరకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ అనుమతులను కొంతమంది అక్రమ వ్యాపారులు అవకాశంగా మలుచుకుని, అనుమతుల పేరిట భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా కొడంగల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇసుకను డంప్ చేస్తూ, కోట్ల రూపాయల వ్యాపారం కొనసాగిస్తున్నట్లు సమాచారం.

తాండూరు, ఇతర ప్రాంతాలకు భారీగా అక్రమ రవాణా

కొడంగల్ పట్టణంలో నిల్వ చేసిన ఇసుకను తాండూరు, పరిసర ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాలకు కూడా టిప్పర్ల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ రవాణా ద్వారా కొంతమంది వ్యాపారులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారని తెలుస్తోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, కొడంగల్ ప్రాంతంలో ఒక్కో టిప్పర్ ఇసుకకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అక్రమ ఇసుక వ్యాపారం కోట్ల రూపాయల వ్యాపారంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు.

అక్రమ ఇసుక రవాణాపై విచారణకు ఆదేశాలు: తహసీల్దార్ రాంబాబు

కొడంగల్ పట్టణంలో పెరుగుతున్న అక్రమ ఇసుక దుకాణాలు, అర్ధరాత్రి వేళల్లో జరుగుతున్న అక్రమ రవాణాపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు కొడంగల్ తహసీల్దార్ రాంబాబు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ప్రతి ఇసుక వ్యాపారి తప్పనిసరిగా లేబర్ లైసెన్స్, మైనింగ్ శాఖ అనుమతులు, పోలీస్ శాఖ అనుమతులు, మున్సిపల్ శాఖ అనుమతులు, రెవెన్యూ శాఖ అనుమతులు కలిగి ఉండాలి. అదేవిధంగా ఇసుక రవాణాకు సంబంధించిన అన్ని అనుమతులు ఎప్పటికప్పుడు చెల్లుబాటులో ఉండాలి. అనుమతులు లేని దుకాణాలపై విచారణ చేపట్టి అవసరమైతే సీజ్ చేస్తాం” అని స్పష్టం చేశారు.

అనుమతులు లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తాం: ఎస్సై జి.వి. సత్యనారాయణ

కొడంగల్ పోలీస్ స్టేషన్ ఎస్సై జి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ, కొడంగల్ పట్టణంలో ఇసుక రవాణాకు ఉపయోగించే వాహనాలు తగిన అనుమతులు లేకుండా రోడ్లపైకి వస్తే వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇసుక దుకాణాల యజమానులు మైనింగ్ శాఖ సహా సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, అక్రమ రవాణాకు పాల్పడితే వాహనాలను సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ప్రజల ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు?

కొడంగల్ నియోజకవర్గంలో రోజురోజుకూ పెరుగుతున్న అక్రమ ఇసుక వ్యాపారంపై సంబంధిత శాఖలు ఇప్పటికైనా దృష్టి సారించి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తాయా? లేక “మమ్మల్ని ఆపేదెవరు?” అంటూ సవాల్ విసురుతున్న అక్రమ వ్యాపారులకే పరోక్షంగా మద్దతు లభిస్తుందా? అనే ప్రశ్నలు ప్రజల్లో తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. అక్రమ ఇసుక రవాణా, నిల్వలు, వ్యాపారాలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles