కొడంగల్ లయన్స్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

  • కొడంగల్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు – తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ లయన్ గుర్నాథ్ రెడ్డి
  • మండల అధ్యక్షుడిగా డా. రవీంద్ర యాదవ్, కార్యదర్శిగా డా. సాకేత్ ఎన్నిక

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ , జూన్ 16:

సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందంజలో నిలుస్తున్న కొడంగల్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని కేఎస్‌వీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో 2026–27 సంవత్సరానికి సంబంధించిన నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియను చేపట్టగా, సభ్యులందరూ ఏకగ్రీవంగా కొత్త కార్యవర్గానికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా డాక్టర్ రవీంద్ర యాదవ్, కార్యదర్శిగా డాక్టర్ సాకేత్, ట్రెజరర్‌గా లయన్ మురారి వశిష్ట, సంయుక్త కార్యదర్శిగా భీమరాజు ఎన్నికయ్యారు. అలాగే క్లబ్ డైరెక్టర్లను కూడా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సమావేశంలో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ లయన్ గుర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, కొడంగల్ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో విశేష గుర్తింపు పొందిందన్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య పరీక్షా శిబిరాలు నిర్వహించడంతో పాటు పేద, నిరుపేద కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

సమాజ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న లయన్స్ క్లబ్ సభ్యుల సేవా దృక్పథం అభినందనీయమని పేర్కొన్న ఆయన, క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయని అన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహించి సమాజాభివృద్ధికి తోడ్పడాలని నూతన కమిటీకి సూచించారు.

కొడంగల్ ప్రాంతానికి లయన్స్ క్లబ్ ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందని, సేవా కార్యక్రమాల ద్వారా సంస్థ ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆయన ఆకాంక్షించారు. నూతన కార్యవర్గం నాయకత్వంలో క్లబ్ మరింత పురోగతి సాధించి సేవా రంగంలో కొత్త మైలురాళ్లు సృష్టిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు డా. రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ, సభ్యులందరూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి సమాజంలోని అన్ని వర్గాలకు చేరువ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. కార్యదర్శి డా. సాకేత్ మాట్లాడుతూ, సభ్యుల సహకారంతో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు.

కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లయన్ ముద్దప్ప దేశ్‌ముఖ్ రామ్‌రెడ్డి, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు, వివిధ విభాగాల ప్రతినిధులు, క్లబ్ సభ్యులు మరియు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం నూతన కమిటీ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles