- అనుమతుల్లేని డంపింగ్ యార్డులు..
- అధిక ధరలతో ప్రజల దోపిడి..!
- మామూళ్ల మత్తులో అధికారులు..?
- ప్రజల నుంచి తీవ్ర విమర్శలు
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
కొడంగల్ పట్టణంలో ఇసుక అక్రమ రవాణా, అనుమతుల్లేని డంపింగ్ యార్డులు, అధిక ధరలకు నిర్మాణ సామగ్రి విక్రయాలు రోజురోజుకూ పెరిగిపోతుండగా సంబంధిత శాఖల అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కొందరి అక్రమ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టణ పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు రాజకీయ అండదండలతో అక్రమ ఇసుక వ్యాపారాన్ని బహిరంగంగానే నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. “మీ బిల్డింగ్‌కు కావాల్సిన అన్ని రకాల ఇసుక, కంకర, డస్ట్, ఇటుకలు మా దగ్గర లభ్యం” అంటూ భారీ బోర్డులు ఏర్పాటు చేసి ప్రజలను ఆకర్షిస్తూ, అధిక ధరలకు విక్రయాలు నిర్వహిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అర్ధరాత్రి వేళల్లో ఇసుక రవాణా
స్థానికుల కథనం ప్రకారం, సమీపంలోని వాగులు మరియు ఇతర ప్రాంతాల నుంచి అర్ధరాత్రి వేళల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుకను తరలించి పట్టణంలోని ఖాళీ స్థలాల్లో డంపింగ్ చేస్తున్నారని సమాచారం. అనంతరం అదే ఇసుకను క్వింటాళ్ల కొద్దీ అధిక ధరలకు విక్రయిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక, కంకర, ఇటుకలు వంటి నిర్మాణ సామగ్రి వ్యాపారం నిర్వహించాలంటే మున్సిపల్ అనుమతులు, మైనింగ్ శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ కొడంగల్‌లో కొనసాగుతున్న మూడు ప్రధాన ఇసుక డంపింగ్ యార్డులకు ఎలాంటి అధికారిక అనుమతులు లేవని అధికారులు చెబుతున్నప్పటికీ, అవి నిర్బంధం లేకుండా కొనసాగుతుండటం అనుమానాలకు తావిస్తోంది.
ఇసుక కొరతను అవకాశంగా మార్చుకున్న వ్యాపారులు
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సాధారణ ప్రజలు ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక కొనుగోలు చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకున్న కొందరు అక్రమ వ్యాపారులు ఒక క్వింటాల్ ఇసుకను రూ.2400 నుంచి రూ.2700 వరకు విక్రయిస్తున్నారని సమాచారం. ట్రాక్టర్ రవాణా ఖర్చుల పేరుతో మరో రూ.3000 వరకు అదనంగా వసూలు చేస్తూ మొత్తం రూ.5000 నుంచి రూ.6000 వరకు ప్రజల నుంచి దండుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాకుండా, సమీపంలోని కంకర మిషన్ల నుంచి కంకర డస్ట్ కొనుగోలు చేసి, తక్కువ ధరలకు ఇటుకలు తెప్పించుకుని వాటిని భారీ లాభాలతో విక్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. నిర్మాణ సామగ్రి పేరుతో జరుగుతున్న ఈ వ్యాపారం పూర్తిగా అక్రమమని పలువురు పేర్కొంటున్నారు.
మామూళ్ల ఆరోపణలు
ఈ అక్రమ దందా వెనుక పెద్దఎత్తున మామూళ్ల వ్యవస్థ నడుస్తోందనే ఆరోపణలు కూడా బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ప్రతినెల పోలీసు శాఖ, మున్సిపల్ శాఖ, మైనింగ్ శాఖ అధికారులకు లక్షల రూపాయల మామూళ్లు అందుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అందుకే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
“అనుమతులు లేని షాపులు అయితే ఎలా నడుస్తున్నాయి..? అక్రమంగా ఇసుక వస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదు..? మైనింగ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు..?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ప్రజలు వాగుల నుంచి ఇసుక తీసుకురావాలంటే కేసులు నమోదు చేసే అధికారులు, పెద్దఎత్తున జరుగుతున్న అక్రమ రవాణాపై మాత్రం మౌనం పాటించడం వెనుక కారణాలేమిటని చర్చ జరుగుతోంది.
ప్రశ్నిస్తే బెదిరింపులా..?
ఈ అక్రమ వ్యాపారాలను ఎవరైనా ప్రశ్నించినా, అడ్డుకునే ప్రయత్నం చేసినా వారిపై దాడులకు దిగేందుకు కూడా కొందరు వెనుకాడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని చెబుతున్నారు. అక్రమ వ్యాపారాలపై సమాచారం ఇచ్చినా అధికారులు స్పందించకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది.
ప్రజల డిమాండ్
కొడంగల్ పట్టణంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక డంపింగ్ యార్డులు, అనుమతుల్లేని నిర్మాణ సామగ్రి వ్యాపారాలపై వెంటనే దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రజలను దోచుకుంటున్న ఇలాంటి అక్రమ దందాలపై అధికారులు నిజంగా ఉక్కుపాదం మోపుతారా..? లేక మామూళ్ల మత్తులోనే చూసీ చూడనట్లు వదిలేస్తారా..? అన్నది ఇప్పుడు కొడంగల్ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
|
మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి |
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



