అక్రమ ఇసుక రవాణా బీభత్సం

  • ట్రాక్టర్‌–బైక్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
  • అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
  • యాలాల్ మండలం దౌలాపూర్ సమీపంలో ఘటన

    శ్రీ బల భీమ న్యూస్ / యాలాల్

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం దౌలాపూర్ గ్రామ సమీపంలో అక్రమ ఇసుక రవాణా మరోసారి ప్రమాదానికి దారితీసింది. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ బైక్‌ను ఢీకొనడంతో మోహిద్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తుల వివరాల ప్రకారం తాండూర్ కాగ్నా వాగు నుంచి కొంతమంది అక్రమార్కులు అధికారులూ, రాజకీయ నాయకుల అండదండలతో రాత్రింబవళ్లు ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాండూర్ కాగ్న వాగు నుంచి కొడంగల్ వైపు భారీగా ఇసుకను తీసుకెళ్తున్న ట్రాక్టర్ అతివేగంగా ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో దౌలాపూర్ గ్రామ శివారుకు చేరుకునే సరికి ట్రాక్టర్ ముందు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. అదుపుతప్పిన ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో కొడంగల్ నుంచి తాండూర్ వైపు వెళ్తున్న మోహిద్ అనే వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు.

ఈ ప్రమాదంలో మోహిద్‌కు రెండు కాళ్లు విరిగిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. శరీరమంతా తీవ్ర గాయాలతో రక్తస్రావం కావడంతో స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రుడిని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. “తోడేళ్లు తోడినట్లు వాగులను దోచేస్తున్నారు… అధికారులకు, ప్రజాప్రతినిధులకు అన్నీ తెలిసినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?” అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండా వందలాది ట్రాక్టర్లు రోజూ ఇసుకను తరలిస్తున్నాయని, దీనివల్ల రోడ్లపై ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అతివేగం, ఓవర్‌లోడ్ కారణంగా గ్రామాల్లో ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక మాఫియాపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. అక్రమ ఇసుక రవాణాపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి

Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles