ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలు

  • నైపుణ్యాభివృద్ధి, ఏఐ శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి : సీఎం రేవంత్ రెడ్డి
  • మూసీ రివర్ ఫ్రంట్‌లో గుడి, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మాణాలకు ఆదేశాలు

శ్రీ భీమా న్యూస్ / కొడంగల్ :

హైదరాబాద్‌: మైనారిటీ విద్యార్థుల విద్యా, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరిన్ని కీలక చర్యలు చేపట్టనుంది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంప్రదాయ విద్యతో పాటు ఆధునిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సాంకేతిక విద్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.

శుక్రవారం సాయంత్రం సచివాలయంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. మైనారిటీ యువత ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా శిక్షణా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సంప్రదాయ కోర్సులతో మాత్రమే పరిమితం కాకుండా, ఉపాధి కల్పించే నైపుణ్య ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, ఆటోమేషన్ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో మైనారిటీ విద్యార్థులు కూడా ఆ రంగాల్లో రాణించేలా ప్రత్యేక శిక్షణ అందించాలన్నారు. మైనారిటీ విద్యాసంస్థల్లో బోధన విధానంలో ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.

ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలని సీఎం ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందిస్తున్నట్లుగానే మైనారిటీ విద్యార్థులకు కూడా ప్రోత్సాహక పథకాలు అమలు చేయాలని పేర్కొన్నారు. విద్యలో, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రత్యేకంగా సన్మానించి వారికి ఆర్థిక సహాయం అందించాలని సూచించారు.

అలాగే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల్లో ఎంపికైన మైనారిటీ అభ్యర్థుల్లో ఆసక్తి ఉన్న వారిని ఎంపిక చేసి మైనారిటీ సంక్షేమ శాఖలో ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ పథకాల అమలు, శాఖ కార్యకలాపాలపై వారికి పూర్తి అవగాహన కల్పించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. తద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందడంతో పాటు ప్రభుత్వ పరిపాలనపై అవగాహన పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమాలకు గ్రూప్స్‌లో ఎంపికైన అధికారులు, జాతీయ స్థాయి క్రీడాకారులను ఆహ్వానించాలని సీఎం సూచించారు. వారి విజయ గాథలను విద్యార్థులకు తెలియజేయడం ద్వారా చదువు, క్రీడలపై ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.

ఇమామ్‌లు, మౌజమ్‌లకు ప్రభుత్వం అందిస్తున్న గౌరవ వేతనాలను క్రమం తప్పకుండా విడుదల చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మైనారిటీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మైనారిటీ ప్రాంతాల్లో ఖబరస్తాన్‌ల సమస్యను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని సీఎం తెలిపారు. భూ లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఖబరస్తాన్‌ల కోసం ప్రత్యేక స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్ల సంక్షేమంపై కూడా కీలక ప్రకటన చేశారు. డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రత్యేక రీట్రోఫిట్టింగ్ ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా ఆటో డ్రైవర్లకు ఇంధన ఖర్చులు తగ్గి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సాధారణ ప్రజలకు తక్కువ ఖర్చుతో రవాణా సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుపై కూడా సీఎం కీలక సూచనలు చేశారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో గుడి, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో గంగా జమునా తెహ్‌జీబ్‌కు ప్రతీకగా నిలిచేలా ఆ కట్టడాలను రూపకల్పన చేయాలని సూచించారు.

భారతదేశ వైవిధ్యభరిత సంస్కృతిని ప్రతిబింబించేలా, అన్ని మతాల ఐక్యతను చాటేలా ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేయాలని సీఎం పేర్కొన్నారు. ఆయా మతాల సంస్కృతులు, సంప్రదాయాలు, చరిత్రను అధ్యయనం చేసే గొప్ప అధ్యయన కేంద్రాలుగా అవి రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని సీఎం అభిప్రాయపడ్డారు.

సమీక్ష సమావేశంలో రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు) మహ్మద్ షబ్బీర్ అలీ, టీజీఎంఆర్ఈఐఎస్ అధ్యక్షుడు మహ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీ, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులామ్ అఫ్జల్ బియాబాని, వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఓబేదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కొకడాన్, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి షఫీఉల్లా తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles