శాంతి సందేశ కార్యక్రమానికి గురునాథ్ రెడ్డికి ఆహ్వానం

  • ఉపాధ్యాయులు, మైనారిటీ నాయకులతో మర్యాదపూర్వక భేటీ

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల పరిధిలోని గౌరారం గ్రామంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న “శాంతి సందేశ కార్యక్రమం”కు తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఉపాధ్యాయులు, మైనారిటీ నాయకులు గురువారం కొడంగల్ పట్టణం లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని అందజేసి, గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ఆహ్వానం తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొల్పేందుకు ఇలాంటి సందేశాత్మక కార్యక్రమాలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో యువత సరైన మార్గంలో నడవాలంటే సామాజిక చైతన్య కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతలో నైతిక విలువలు పెంపొందించడంతో పాటు పరస్పర గౌరవం, సోదరభావం, ఐక్యత వంటి మంచి భావనలు పెరగాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.

శాంతి సందేశ కార్యక్రమం ద్వారా అన్ని వర్గాల ప్రజలు ఒకే వేదికపైకి వచ్చి సామాజిక ఐక్యతను చాటాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. గ్రామాల్లో పెరుగుతున్న విభేదాలు, సామాజిక దూరాలను తొలగించి ప్రేమ, శాంతి, సహన భావాలు పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు, యువత సమాజానికి ఆదర్శంగా నిలవాలని, మానవతా విలువలను కాపాడాలని ఈ వేదిక ద్వారా సందేశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువజన నాయకులు, సామాజిక కార్యకర్తలు, మత పెద్దలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామ ప్రజలు, యువత, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు.

ఆహ్వాన కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు గౌరారం గోపాల్, ఎంబీటీ నాయకులు షఫీ యుద్దీన్, మైనారిటీ నాయకులు హస్నావుద్దీన్ సిద్ధిఖీ (హాజీ) తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావాలని వారు ఆకాంక్షిస్తూ, శాంతి సందేశ కార్యక్రమం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles