మంత్రి కొండ సురేఖ క్షమాపణలు చెప్పాలి – బీజేవైఎం నేత తాండ్ర నరేష్ డిమాండ్


  • “జై శ్రీరామ్” వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు…
  • హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపణ

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :

తాండూర్: హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) తాండూర్ పట్టణ అధ్యక్షుడు తాండ్ర నరేష్ డిమాండ్ చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“జై శ్రీరామ్ అంటే పై నుంచి డబ్బులు పడతాయా” అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు రామభక్తులను అవమానించడమేనని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి దేవుళ్లను కించపరిచేలా మాట్లాడటం తగదని, ఇది దిగజారుడు వ్యాఖ్య అని విమర్శించారు.రామనామం భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీక అని, దాన్ని రాజకీయ విమర్శలలోకి లాగడం సరైంది కాదని నరేష్ అన్నారు. “భక్తి భావంతో ప్రతి ఒక్కరూ జపించేది రామనామమే గానీ, అది ఎలాంటి వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే పదం కాదు” అని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ విధానాలపై కూడా నరేష్ విమర్శలు గుప్పించారు. హిందువుల మనోభావాలను గౌరవించకుండా మాట్లాడటం సరికాదని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో విభేదాలకు దారితీసే అవకాశముందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా హిందువులందరూ ఈ విషయంపై స్పందించాలని ఆయన కోరారు.మంత్రి కొండ సురేఖ వెంటనే క్షమాపణలు చెప్పకపోతే రామభక్తుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మత భావాలను గౌరవించడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుండగా, మంత్రి స్పందనపై ఆసక్తి నెలకొంది.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles