కొడంగల్ ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు చలివేంద్రం ప్రారంభం

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :

కొడంగల్: వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం కొడంగల్ ఆర్టీసీ బస్టాండ్‌లో చలివేంద్రాన్ని గురువారం కొడంగల్ ఆర్టీసీ బస్టాండ్ ఇంచార్జ్ హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో తాండూరు డిపో మేనేజర్ సురేష్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడంగల్ బస్టాండ్‌కు ప్రతి రోజు పలు ప్రాంతాల నుండి వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో చల్లని తాగునీరు అందించడం చాలా అవసరమని పేర్కొన్నారు. చలివేంద్రం ఏర్పాటు ద్వారా ప్రయాణికులకు తక్షణ ఉపశమనం లభిస్తుందని, ఇది మంచి సేవా కార్యక్రమమని అభినందించారు.

ఆర్టీసీ ఇంచార్జ్ హనుమంతు ముదిరాజ్ మాట్లాడుతూ, ప్రయాణికుల ఆరోగ్యం మరియు సౌకర్యం దృష్ట్యా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. వేసవిలో డీహైడ్రేషన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయని, అందుకే ప్రతి ప్రయాణికుడు తగినంత నీరు తాగడం అత్యంత అవసరమని సూచించారు. ఆర్టీసీ సిబ్బంది ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉంటారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది భూషణం, పవన్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చలివేంద్రం ప్రారంభంతో బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

స్థానికులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా చేపట్టాలని కోరారు. వేసవి కాలం మొత్తం చలివేంద్రం నిరంతరంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు .

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles