కొడంగల్‌లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించిన పోలీసులు – అవగాహన కార్యక్రమాలకు విశేష స్పందన

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్

కొడంగల్ పట్టణంలో విద్యార్థులలో సామాజిక బాధ్యతాభావం, చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు పోలీసులు ప్రత్యేకంగా వ్యాసరచన పోటీలను నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఓ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో  బుధవారం  ప్రజాపాలన – పట్టణ ప్రణాళికలో భాగంగా  చైల్డ్ డ్రగ్స్ అవేర్‌నెస్, సైబర్ క్రైమ్ నివారణ, చట్టాలపై అవగాహన వంటి కీలక అంశాలపై ఈ పోటీలను ఏర్పాటు చేయడం జిల్లా స్నేహా మెహ్రా, IPS ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ శ్రీధర్ రెడ్డి, ఎస్సై జి.వి. సత్యనారాయణ సమక్షంలో పోటీలు జరిగాయి. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. సమాజంలో పెరుగుతున్న సమస్యలపై అవగాహన పెంపొందించేందుకు విద్యార్థులు చురుకుగా స్పందించడం గమనార్హం.

ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ చట్టాలపై సరైన అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం ప్రమాదకరమని, అలాంటి దుష్ప్రవర్తనలకు దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా సైబర్ క్రైమ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, మొబైల్ మరియు ఇంటర్నెట్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు.

సోషల్ మీడియా ద్వారా వచ్చే మోసపూరిత సందేశాలు, ఫోన్ కాల్స్, ఫేక్ లింక్స్ వంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద చర్యలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత సమాచారం రక్షణపై దృష్టి పెట్టాలని పోలీసులు స్పష్టం చేశారు.

వ్యాసరచన పోటీలలో విద్యార్థులు చక్కటి ఆలోచనలతో, సమాజానికి ఉపయోగపడే విషయాలను ప్రతిపాదిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలకు త్వరలోనే బహుమతులు అందజేయనున్నట్లు  తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంతో పాటు, సమాజానికి బాధ్యతగల పౌరులుగా మారేందుకు ప్రోత్సాహం లభించిందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు మరియు ఇతరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles