ఏఐజి హాస్పిటల్ ఆధ్వర్యంలో డయాబెటిస్ ఉచిత వైద్య శిబిరం

  • చిన్న నందిగామలో భారీ స్పందన – 157 మందికి వైద్య పరీక్షలు

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :

కొడంగల్ మండలం పరిధిలోని చిన్న నందిగామ గ్రామంలో AIG హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ దత్తాత్రేయ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల గ్రామాలలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యం మనిషికి అత్యంత విలువైన సంపద అని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా డయాబెటిస్, గుండె, లివర్, కిడ్నీ వంటి జీవనశైలి వ్యాధులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి శిబిరాలు ప్రజలకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో గుండె, లివర్, కిడ్నీ సంబంధిత స్కానింగ్‌లు, రక్తపరీక్షలు, షుగర్ పరీక్షలు మరియు ఇతర వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహించారు.

హాస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ శశికళ మాట్లాడుతూ, ఏఐజి హాస్పిటల్ తరచుగా వివిధ ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు మరియు ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ఉచిత శిబిరాలను నిర్వహిస్తుందని తెలిపారు. ముఖ్యంగా డయాబెటిస్ (మధుమేహం) వంటి వ్యాధులు గ్రామీణ ప్రాంతాలలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా తరచుగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో డయాబెటిస్‌తో పాటు ఇతర జీవనశైలి వ్యాధులపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించామని తెలిపారు. శిబిరంలో మొత్తం 157 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో గణనీయమైన సంఖ్యలో ప్రజలకు డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించారు. కొంతమంది ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందుతున్న మందులను తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను కూడా అందజేశారు. గ్రామ సర్పంచ్ దత్తాత్రేయ రావు గ్రామ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, కార్పొరేట్ ఆసుపత్రుల సహకారంతో ఇలాంటి శిబిరాలను ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు ఆయనను అభినందించారు. గ్రామంలోని ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విద్య, డాక్టర్ సుష్మ, డాక్టర్ అభిషేక్, డాక్టర్ జమాన్, కోఆర్డినేటర్ సృజన్, జూనియర్ డాక్టర్ దేవాన్, సిస్టర్లు సునీత, సౌజన్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అలాగే గ్రామ ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై శిబిరాన్ని విజయవంతం చేశారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .

ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను  Subscribe చేయండి ధన్యవాదాలు.

www.youtube.com/@sribalabheema7188

🔥🔥 ప్రియమైన మిత్రులారా… 🔥🔥

మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది 📺

👉 ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
🔔 బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి

మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం 💪

📢 మీ మద్దతు – మన విజయానికి పునాది
👉 ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!

🔥 కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం 🔥

www.youtube.com/@sribalabheema7188

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles