శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
కొడంగల్, బుధవారం: అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కొడంగల్ ఫైర్ స్టేషన్ అధికారి P. ప్రభాకర్ సూచించారు. స్థానిక అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో బుధవారం కొడంగల్ ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, అపార్ట్మెంట్లు, పాఠశాలలు, కళాశాలలు, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్లు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రజా రద్దీ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రమాదం సంభవించిన సమయంలో ప్రజలు తమ ప్రాణాలు, ఆస్తులను ఎలా కాపాడుకోవాలో సిబ్బంది ద్వారా వివరంగా అవగాహన కల్పించారు.

ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులకు వాల్ పోస్టర్లు అతికిస్తూ, ప్రయాణికులకు కరపత్రాలు పంపిణీ చేసి అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ముఖ్యంగా మహిళలకు ఇంటి వంట సమయంలో పాటించాల్సిన భద్రతా సూచనలు తెలియజేశారు. వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం జరిగితే ఆందోళన చెందకుండా తక్షణమే మంటలను నియంత్రించే చర్యలు తీసుకోవాలని సూచించారు.
దుస్తులకు నిప్పు అంటుకున్నప్పుడు పరుగెత్తకుండా నేలపై దొర్లుతూ దుప్పట్లు లేదా గుడ్డతో కప్పుకోవాలని సూచించారు. మండుతున్న మంటలపై కిరోసిన్ పోయడం ప్రమాదకరమని హెచ్చరించారు. వంటగదిలో కిరోసిన్, డీజిల్, పెట్రోల్, అదనపు గ్యాస్ సిలిండర్లు నిల్వ చేయకూడదని స్పష్టం చేశారు.

అదేవిధంగా, పాఠశాలలు, షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు వంటి భవనాల్లో ఆర్సీసీ లేదా కాంక్రీట్ పైకప్పులు మాత్రమే ఉపయోగించాలని, ఫైర్ అలారం మరియు స్మోక్ డిటెక్టర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు బస్సుల్లో భద్రతా పరికరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను ప్రత్యక్షంగా చూపించారు. ఈ కార్యక్రమంలో పవన్ కుమార్, సయ్యద్ మతిన్, శ్రీనివాస్, ఎం.డి. పురానుద్దీన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188


