శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్
మహాజ్ఞాని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన అందరివాడని కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ కొనియాడారు. మంగళవారం కొడంగల్ మండల పరిధిలోని నాగారం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని ఆయన ఘనంగా ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం మాజీ సర్పంచ్ బసంత్ రెడ్డి, సర్పంచ్ పట్లోళ్ల ప్రశాంతి మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్నం అంబయ్య గౌడ్ మరియు గ్రామస్తులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

రాజ్యాంగ నిర్మాత సేవలు అనన్యం
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ మరియు సర్పంచ్ ప్రశాంతి మాట్లాడుతూ..దేశ విదేశాల్లోని రాజ్యాంగాలను పరిశీలించి, భారతదేశానికి ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్ దేనని పేర్కొన్నారు. నేడు బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఉన్నత పదవులు, ఉద్యోగాలు పొందుతున్నారంటే అది ఆయన కృషి ఫలితమేనని అన్నారు. మహిళా విద్యపై ఆనాడే అవగాహన కల్పించి, స్త్రీలు చదువుకుంటేనే కుటుంబాలు బాగుపడతాయని చాటిచెప్పిన మహనీయుడని గుర్తుచేశారు.

ఉత్సాహంగా సాగిన ర్యాలీ
గ్రామంలో యువత, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ‘జై భీమ్’ నినాదాలతో హోరెత్తిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి, కౌన్సిలర్ కృష్ణంరాజు, అంబేద్కర్ సంఘాల నాయకులు రమేష్ బాబు, వెంకటప్ప, రాములు, ఉపసర్పంచ్ మధుసూదన్, వార్డు సభ్యులు డీలర్ రాజు గౌడ్, ప్రభాకర్ రెడ్డి, పకీరప్ప, శంకరప్ప, దేవేందర్ గౌడ్, పాండు, ప్రసాద్ రెడ్డి మరియు అన్నారం, రుద్రారం, టేకులకోడు గ్రామాల ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188


